Saturday, October 23, 2021

ధాన్యం కొనుగోలు వద్ద సంచుల కొరత..

జిల్లాలో 1కోటీ 24లక్షల సంచులు అవసరం
తూకం పేరుతో అన్నదాతల దోపిడి
తేమె తాళ్ల పేరుతో కట్టింగ్‌
మెదక్‌ : అన్నదాత ఎంతో కష్టంగా గత 6 నెలలుగా కష్టపడి.. పెట్టుబడి పెట్టి తనకున్న పొలంలో పంట పండించుకుంటూ బ్రతుకుతుంటారు. వారికి వేరే పని తెలియదు. వ్యవసాయమే పని. ఆరు నెలలు కష్టపడితే ఆఖరుకు పంట చేతికి వచ్చాక పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేద్దామంటే రైతన్నలు నానా తిప్పలు పడుతున్నారు. మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతుకు మూడు వ్యతిరేక చట్టాలు తెచ్చాయి. దీంతో రైతులు అయోమయానికి గురయ్యారు. పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చునని చెప్పడంతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు. తీరా రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వమని నిరూపించుకుంది. గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని చెప్పడంతో రైతన్నలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మెదక్‌ జిల్లాలో 354 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లాలో అక్కడక్కడ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. వరికోతకు వచ్చింది అమ్మివేద్దామని అనుకొని డబ్బులు చేతికి వచ్చేస్తాయని సంతోషంతో ఉన్న రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తిప్పలు పడుతున్నారు. తూకం వద్ద అన్నదాతలు సంచుల కొరత, తూకంలో కిలో 300 గ్రాములు తీస్తున్నారు. దీంతో రైతులు పండించిన పంటకు మద్దతు ధర కోల్పోతున్నారు. ఒక రైతు వంద బస్తాలు పండిస్తే క్వింటాల్‌ పై బడి ధాన్యం దోపిడికి గురవుతుంది. మెదక్‌ జిల్లాలో చాలా కొనుగోలు కేంద్రాల వద్ద ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రైతులు చెప్పుకోలేని విధంగా ఆందోళనకు గురవుతున్నారు. చెప్పుకుంటే మా పంటలు కొనుగోలు చేస్తారో లేదో రైతన్నలు వాపోయారు. ప్రభుత్వం అనుగుణంగా కొనుగోలు కేంద్రం వద్ద 40 కిలోల తూకం వేయాలి కానీ 41కిలో 300 గ్రాములు సుమారు కిలోమీద 300 గ్రాముల ధాన్యాన్ని దోపిడి చేస్తున్నారు. మెదక్‌ మండలం, హవేళిఘణపూర్‌ పలు గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వానికి అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేయాలని, తూకం పేరుతో కిలోమీద 300 గ్రాములు తీయడం అన్నదాతలకు ఎంతో నష్టం జరుగుతుందని పలువురు రాజకీయ నాయకులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లులో కూడా అన్నదాతలకు కష్టాలకు గురిచేస్తున్నారు.

ప్రభుత్వ ఆదేశాలు బేఖతార్‌ చేయవద్దు : జిల్లా సివిల్‌సప్లయ్‌ అధికారి శ్రీనివాస్‌
ప్రభుత్వ ఆదేశాలను బేఖతార్‌ చేయవద్దని జిల్లా సవిల్‌సప్లయ్‌ అధికారి శ్రీనివాస్‌రావు హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద తూకం పేరుతో రైతులకు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పడంతో అలాంటిది ఏమిలేదని ఆంధ్రప్రభకు ఆయన తెలిపారు. అలాంటి ఏమైనా ఉంటే రైతులు ఎవరైనా మాకు ఫిర్యాదు చేయవచ్చునన్నారు. తూకం వద్ద ఎలాంటి అవకతవకలు జరగకుండా ఒక విఆర్‌ఓను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో సంచుల కొరత ఉండడం వాస్తవమని, త్వరలో రానున్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News