Friday, October 4, 2024

MDK: మల్కాపూర్ చెరువులో నిర్మించిన భవనం కూల్చివేత.. హోంగార్డుకు గాయాలు

హైదరాబాద్: రాష్ట్రంలో హైడ్రా స్ఫూర్తితో కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డిలో పలుచోట్ల భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు చేపట్టారు. తాజాగా సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువు మధ్యలో అక్రమంగా నిర్మించిన ఇంటిని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కూల్చేశారు.

చెరువు నీటి మధ్యలో కట్టిన బిల్డింగ్‌ను బ్లాస్టింగ్‌ చేసే క్రమంలో బిల్డింగ్ శకలాలు తగిలి హోంగార్డు గోపాల్‌కు గాయాలయ్యాయి. వెంటనే ఆయ‌న‌ను హాస్పిటల్‌కు తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement