Thursday, April 18, 2024

దళారుల చేతిలో మోసపోవద్దు..

హవేళిఘనపూర్‌ : మండలంలో హరిద్వార్‌ గ్రామపంచాయతీ పరిధిలో పిఏసిఎస్‌ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో ప్రవేశపెట్టామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు తయారు చేశారన్నారు. కొండపోచమ్మసాగర్‌ నుండి హల్దివాగు, ఘణపూర్‌ ప్రాజెక్టు, ఎఫ్‌ఎన్‌, ఎం.ఎన్‌ కెనాల్‌కు నీరు నిరంతరం ప్రవహిస్తాయని ఆమె తెలిపారు. దీంతో రైతులు సంవత్సరానికి రెండు పంటలు వేసుకోవాలని ఆమె తెలిపారు. ఐకేపి సెంటర్‌ ద్వారా సొసైటీల ద్వారా ప్రతి వడ్లగింజలు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. నియోజకవర్గ గ్రామాలలో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీవైస్‌ ఛైర్మన్‌ లావణ్యరెడ్డి, జడ్పీటిసి సుజాత శ్రీనివాస్‌రెడ్డి, ఎంపిపి నారాయణరెడ్డి, వైస్‌ ఎంపీపీ రాధాకృష్ణయాదవ్‌, సర్పంచ్‌ సౌందర్య వినోద్‌, సొసైటీ ఛైర్మన్‌ బ్రహ్మం, ఎంపిటిసి రాజయ్య, డిఎస్‌ఓ శ్రీనివాస్‌, ఏఈఓ విజృంభణ, టిఆర్‌ఎస్‌ నాయకులు నరేందర్‌రెడ్డి, రాజిరెడ్డి, రాజేశ్వర్‌రావు, అంజనేయులు, మాజీ సర్పంచ్‌ బ్రహ్మం, గ్రామస్తులు, వార్డు మెంబర్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement