Thursday, March 28, 2024

గుమ్మడిదలలో ఏటీఎం చోరీకి యత్నం

గుమ్మడిదల : డీసీసీ బ్యాంక్ గుమ్మడిదల శాఖలోని ఏటీఎం చోరీకి ఓ దొంగ‌ య‌త్నించాడు. గత రాత్రి రెండుగంటల సమయంలో ఏటీఎంలోకి చొరబడిన దుండగుడు గొడ్డలి, రాడ్డుతో ఏటీఎం మిషన్లు పగలగొట్టాడు. చప్పుడు విన్న ఇంటి యజమాని బ‌య‌ట‌కు వ‌చ్చి అరవడంతో దుండ‌గుడు పారిపోయాడు ఎంతకీ ఏటీఎం తెరుచుకోకపోవడంతో వెనుదిరిగాడు. సీసీ కెమెరాలో రికార్డైన దుండగుడి చిత్రాలను పోలీసులు క్లూస్ టీంతో గాలింపు చర్యలు చేపట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement