Tuesday, January 25, 2022

ఆరోపణలు చేస్తే సహించం : మంత్రి హ‌రీశ్ రావు

దేశంలోనే ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంపై తెలిసీ.. తెలియక ఆరోపణలు చేస్తే సహించబోమని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. సిద్దిపేట పత్తీ మార్కెట్ యార్డ్ లో నిర్వహించిన రైతుబంధు వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి విమర్శలు వంద ఎలుకలు తిన్న పిల్లి నేను శాఖాహారి అన్నట్టుందని ప్రజలు తిరస్కరిస్తే .. దొడ్డిదారిన సిఎం అయిన చరిత్ర శివరాజ్ సింగ్ చౌహాన్ దేనని సిఎం కేసిఆర్ పై చేసే విమర్శ.. సూర్యుడి మీద ఉమ్మి వేసినట్టుందని విమర్శించారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రి గా చౌహాన్ మధ్య ప్రదేశ్ ను ఉద్దరిచింది, సాధించింది ఏమిటని, ఏ రంగంలో కూడ మధ్య ప్రదేశ్ తెలంగాణ కు పోటీ.. సాటి కాదన్నారు. గొప్పగా పాలిస్తే తెలంగాణలో మధ్య ప్రదేశ్ కూలీలు ఎందుకుంటారని, ఏడు ఎండ్లలో అన్ని రంగాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలంగాణ ను దేశానికే అగ్రగామిగా నిలిపారన్నారు.


భౌగోళికంగా పెద్ద రాష్ట్రం అయిన మధ్య ప్రదేశ్ GDP కంటే తెలంగాణ GDP ఎక్కువని, తెలంగాణ GDP 9.78 లక్షలు. మధ్య ప్రదేశ్ GDP 9.77 మాత్రమేనని,
తలసరి ఆదాయం లో మధ్య ప్రదేశ్ తలసరి ఆదాయం తెలంగాణ లో సగం కూడ లేదన్నారు. బీజీపీ నాయకులు రాజకీయాల కోసం విమర్శ లు మానుకోవాలని హితవు పలికారు. ఉచిత త్రాగునీరు, విద్యుత్, రైతు బంధు, భీమా మీ మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయా.. రైతు రుణ మాఫీ కోసం మధ్య ప్రదేశ్ లో రైతులు ధర్నా చేస్తే ఆరుగురు రైతులను పిట్టల్లా కాల్చి చంపిన నరహంతక చరిత్ర చౌహాన్ దేనని ఆరోపించారు. స్థానిక నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ లు చదివితే అభాసు పాలయ్యేది మీరేనని, కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ATM తో పోల్చడం సరికాదని హితవు పలికారు. పార్లమెంట్ లో ఎలాంటి అవినీతి జరగలేదని మీ ప్రభుత్వమే స్పష్టం చేసిందని, మధ్య ప్రదేశ్ వ్యాపం కుంభకోణం లో మీపైనే అవినీతి ఆరోపణలు వచ్చాయిని, ఆ సంగతి ఎందో మీరే ప్రజలకు చెప్పాలన్నారు.


పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్టు మీ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల స్పిరిట్ తో, రాష్ట్రపతి నిబంధనలు లోబడి, అమలు చేసేందుకు G.O 317 వచ్చిందని, స్థానికులకు 95 శాతం ఉద్యోగుల ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ను కోరితే మీరు ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడే GO 317 ను తెచ్చామన్నారు. తెలంగాణ లో ఒక్క ఖాళీ కూడ లెకుండా నియామకం చేయాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి సకల్పమన్నారు. ఉద్యోగాల నియామకం చేయద్దన్న ఉద్దేశ్యం తో నే GO రద్దు కు బిజెపి పట్టు పడుతున్నదని, దేశంలోనే అత్యధిక జీతాలు పొందుతున్న ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులేనన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కంటే తెలంగాణ ఉద్యోగుల జీతాలు ఎక్కువన్నారు. ఉద్యోగులకు కేంద్రం 15 శాతం ఫిట్ మెంట్ ఇస్తే తెలంగాణ ప్రభుత్వము 73 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిందన్నారు. యాడాది కి రూ. 2 కోట్లు, ఎదేండ్ల లో రూ.14 కోట్ల ఉద్యోగాల లెక్క బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా చెప్పాలన్నారు. కేంద్రంలో 15 లక్షల 62 వేల 962 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయిని, వెంటనే ఈ నియామకాలు చేపట్టాలని, ఈ ప్రక్రియ కాగానే ఒక్క ఖాళీ లేకుండా భర్తీ చేసే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు.

అర్మీలో 2 లక్షలు, రైల్వే 3 లక్షలు, బ్యాంకులో 41 వేల ఉద్యోగాలు , విద్యారంగ సంస్థలలో 33 శాతం ఖాళీలు ఉన్నాయిని, 2014 ముందు దేశంలో నిరుద్యోగ రైతు 5 శాతం ఉంటే 2021 లో 7.9 శాతం కు పెరిగిందన్నారు. తెలంగాణ లో 2.2 శాతం మాత్రమే నిరుద్యోగ రేటు ఉందన్నారు. తెలంగాణ లో మిషన్ భగీరథ రాని గ్రామం ఏదైనా ఉందా…. చుక్క నీరు రావడం లేదని నడ్డా విమర్శించడం ఎంతవరకు సమంజసమన్నారు. నేతి బీరకాయ లో నెయ్యి ఎంత ఉందో…నడ్డ మాటల్లో నిజం అంతే ఉందని ఎద్దేవా చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శేఖవత్ అనేక సార్లు మిషన్ భగీరథ ను ప్రశంసించారని, అసంబద్ధ, అవకాశ వాద, పసలేని ఆరోపణ లతో బిజెపి భారతీయ జూటా పార్టీ గా బీజీపీ మారిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రోజా శర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు వంగ నాగిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెలేటీ రాధాశర్మ, ఇతర స్థానిక నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News