Monday, May 29, 2023

బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే వెన్నుముక : ఎమ్మెల్యే జీఎంఆర్

అమీన్పూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే వెన్నుముకగా నిలుస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూసుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రతీ కార్యకర్త సమాయత్తం కావాలని కోరారు. ఏప్రిల్ 9వ తేదీ ఆదివారం సాయంత్రం అమీన్పూర్ మున్సిపల్ స్థాయి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ పరిధిలోని ప్రతీ వార్డు నుండి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు హాజరయ్యేలా చూడాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలను గడపగడపకు చేరవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బాల్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement