Saturday, December 7, 2024

అత్తపై అలిగి…. కరెంట్ పోల్ ఎక్కి ……

మెదక్ : ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడు పెళ్లైన తర్వాత అత్తగారు బంగారం పెట్టడం లేదని అసంతృప్తితో విద్యుత్‌ స్తంభం ఎక్కి హల్‌చల్‌ చేసిన ఘటన మెదక్‌ పట్టణం గాంధీనగర్‌ వీధిలో చోటు చేసుకుంది. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన శేఖర్‌ ఎలక్ట్రిషన్‌ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతను కొంతకాలం క్రితం యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. పెళ్లైెన తమకు అత్తగారు బంగారం పెట్టడం లేదని కరెంటు స్తంభం ఎక్కాడు. అతను స్తంభం ఎక్కడాన్ని గమనించిన స్థానికులు కరెంటు సరఫరాను నిలిపివేశారు. అక్కడికి చేరుకున్న మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ బట్టి జగపతి, డీఎస్పీ సైదులు, సీఐ గోపీనాథ్‌, అతనికి నచ్చజెప్పి విద్యుత్‌ స్తంభం నుంచి కింద‌కు దించారు. అత్తగారు బంగారం పెట్టలేదని స్తంభం ఎక్కడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. యువకుడు సురక్షితంగా కిందకు దిగడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement