Sunday, February 5, 2023

బండరాయి మీదపడి వ్యక్తి దుర్మరణం..

పటాన్ చెరు : స్క్రాప్ సేకరిస్తున్న వ్యక్తి పై ప్రమాదవశాత్తు బండరాయి మీదప‌డి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మున్సిపాలిటీ పరిధిలో నేలను చదును చేస్తున్నారు. అదే సమయంలో అక్కడ స్క్రాప్ సేకరిస్తున్న టేక్మాల్ మండలం, భీమ్లా తాండకు చెందిన హరిచంద్ర అనే కూలీపై టిప్పర్ లోడు కాలి చేస్తున్న స‌మ‌యంలో పెద్ద బండ‌రాయి వ‌చ్చి ప‌డ‌టంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి వేళల్లో అనుమతులు ఇవ్వడం పై ప‌లువురు మండిపడుతున్నారు. కాగా మృతుడు హరిచంద్ర పనికి వెళ్తున్నానని చెప్పి వెళ్లాడని కుటుంబీకులు తెలిపారు. సంఘటనపై మృతుని కుటుంబీకులు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement