Wednesday, April 24, 2024

గుంతలను పూడ్చే పనులు

నిజాంపేట : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రహదారిపై ఉన్న ను ప్రారంభించిన పాలకవర్గం,ఈమేరకు నిజాంపేట మండల శివారులోని నస్కల్ గ్రామానికి వెళ్లే రోడ్డు నుండి చిన్న నిజాంపేట శివారు వరకు రహదారి గుంతలుగా మారడంతో ఉపాధిహామీ పనులతో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, సర్పంచు గేరుగంటి అనూష చేతుల మీదుగా ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం నిరుపేదలకు ఒక వరం లాంటిదని ప్రతి ఒక్కరికి వంద రోజులు ఉపాధి హామీ పనులు కల్పించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఉపాధిహామీ పనుల వద్ద కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. ముక్యంగా మెదక్ సిద్దిపేట జిల్లాల సరిహద్దు గ్రామమైన చిన్న నిజాంపేట గ్రామం అతి సమీపంలో ఉన్నందున నిత్యం మండల కేంద్రానికి నిత్యావసరల కోసం ప్రజలు ఎక్కువగా రాకపోకలు నిర్వహిస్తుంటారని, అలాగే చిన్న నిజాంపేట గ్రామం నుండి పుణ్యక్షేత్రంమైన కూడవెళ్లి రామలింగేశ్వర దర్శనానికి వెళ్లేందుకు తక్కువ సమయం పడుతుందని ఇట్టి రహదారి నిర్మాణానికి శాశ్వత పరిష్కరం కోసం ఎంపీ, ఎమ్యెల్సి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకవెళ్లి వారి సహకారంతో నిధులను మంజూరు చేసుకొని నస్కల్ రోడ్డు నుండి చిన్న నిజాంపేట్ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించుకుంటామని, వారు తెలిపారు. ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎదుగని వెంకటేశం, ఉప సర్పంచ్ కొమ్మాట బాబు, గేరుగంటి బాబు, అబ్దుల్ పాషా, ఉపాధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement