Saturday, June 12, 2021

వ్యాక్సిన్ వేయించుకున్న పీఏసీఎస్ చైర్మెన్

రామయంపేట : మండల కేంద్రానికి చెందిన పీఏసీఎస్ చైర్మెన్ పి బాపురెడ్డి రామయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కరోన వ్యాక్సిన్ టీకా వేహించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతు కరోన వ్యాక్సిన్ వెహించుకున్న తర్వాత కూడా సామాజిక దూరం పాటిస్తూ మస్కులు ధరించి కరోన నిబంధనలు పాటించాలన్నారు. వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు రావని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో భారత శాస్త్రవేత్తలు అతి తక్కువ వ్యవధిలో కరోనను నివారించేందుకు వ్యాక్సిన్ కనుగొని అందుబాటులోకి తేవడం అభినందనీయమని , ఇది భారత దేశ శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. ముఖ్యంగా కరోన వైరస్ పట్ల జాగ్రత్తలు వహిస్తూ ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా చేసుకొని కరోన నిబంధనలు పాటించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News