Tuesday, April 13, 2021

రామాయంపేట మున్సిపల్ కమిషనర్ గా శ్రీనివాస్ ..

రామాయంపేట మున్సిపల్ కమిషనర్ గా జి శ్రీనివాస్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. అంతేకాకుండా మున్సిపాల్టీల్లో ప్రతి ఒక్కరు అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. గతంలో నారాయణపేట గ్రేట్ టు కమిషనర్ గా ఉండి రామాయంపేట కు బదిలీపై వచ్చినట్లు ఆయన తెలిపారు. కొంతకాలంగా రామాలయంపేట మున్సిపల్ కమిషనర్గా స్థానిక తాహ‌సిల్దార్ శేఖర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా శ్రీనివాస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ కు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ లతో పాటు పలువురు అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News