Wednesday, May 19, 2021

కుప్ప కూలిన మూడంతస్తుల భవనం..

సిద్ధిపేట : గజ్వేల్‌లో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. కొత్త భవనం నిర్మించేందుకు సెల్లార్‌ తీస్తుండగా పక్కనే ఉన్న మూడంతస్తుల భవనం కూలిపోయింది. దీంతో జగదేవ్‌పూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన యాదగిరి అనే వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని దవాఖానకు తరలించారు. ఈ ఘటన జరగడానికి ముందే ఆ భవనంలో ఉంటున్న కార్మికులు బయటకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. రెవెన్యూ, పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.   

Advertisement

తాజా వార్తలు

Prabha News