Sunday, June 4, 2023

అధిక కౌలు వసూళ్లు- రైతుల‌కు మావోల హెచ్చ‌రిక‌..

భద్రాద్రి: కౌలు రైతుల నుంచి ఎక‌రానికి ల‌క్ష రూపాయిలు వ‌సూలు చేస్తున్న రైతుల‌పై మాయియిస్ట్ లు క‌న్నెర్ర‌చేశారు.. పెత్తందారి వ్య‌వ‌స్థ గ్రామాల‌లో తిరిగి పుంజుకుంటున్న‌దంటూ మండిప‌డింది.. రైతులను సాగుకు దూరం చేస్తే చర్యలు తప్పవని లేఖ ద్వారా సూచించారు. ఎకరానికి రూ.లక్ష కౌలు తీసుకునే వలస వాదులారా ఖబడ్దార్.. అధిక కౌలు వసూలు చేస్తే శిక్ష తప్పదని హెచ్చరిక జారీ చేశారు. ఈ మేర‌కు జిల్లాలోని చర్ల శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో లేఖ విడుదలైంది. ఈ లేఖతో రైతులు ఆందోళన చెందుతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement