Friday, April 19, 2024

ప్రమాణ స్వీకారానికి రండి: మంత్రి తలసానికి మంచు విష్ణు ఆహ్వానం

‘మా’ ఎన్నికల్లో విజయం సాధించిన మంచు విష్ణు.. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. గురువారం మంచు విష్ణు, ట్రెజరర్ శివబాలాజీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈనెల 16 వ తేదీన జరిగే మా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వారు మంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంచు విష్ణుకు మంత్రి తలసాని శుభాకాంక్షలు తెలిపారు. సినిమా పరిశ్రమకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

అంతకు ముందు.. నటుడు మోహ‌న్‌బాబు, విష్ణుతో క‌లిసి హీరో బాల‌కృష్ణని కసిశారు. బాలయ్యతో  ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు.

ఇది కూడా చదవండి:మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ తప్పువు: పాక్ కు అమిత్ షా వార్నింగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement