Wednesday, April 24, 2024

శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం కోసం ప్రార్ధిద్దాం: మంచు విష్ణు

కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై  ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రి వైద్యులతో తాను మాట్లాడానని తెలిపారు. శివ శంకర్ మాస్టర్ కోలుకునేందుకు అన్ని విధాలుగా చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారని విష్ణు చెప్పారు. ఆయన ఆరోగ్యం కోసం ఎంతో శ్రమిస్తున్నారని వెల్లడించారు. శివశంకర్ కుమారుడు అజయ్ తో తాను ఫోన్ లో మాట్లాడానని తెలిపారు. ఆయన కుటుంబానికి మీ అందరి ప్రార్థనలు ఎంతో అవసరమని చెప్పారు.

మరోవైపు శివశంకర్ మాస్టర్ బిల్లులు చెల్లించడానికి ఆయన కుటుంబం ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో ఆయనకు సాయం చేసేందుకు తమిళ స్టార్ హీరో ధనుష్, నటుడు సోను సూద్ ఇప్పటికే ఆర్థిక సాయం చేశారు. శివశంకర్ మాస్టర్ వైద్య ఖర్చుల నిమిత్తం ఏకంగా రూ.10లక్షల ఆర్థిక సాయం చేశారు హీరో ధనుష్. శివశంకర్ మాస్టర్ త్వరగా కోలుకోవాలని ధనుష్ ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement