Tuesday, September 26, 2023

Manchiryala : ఎందరో త్యాగాల ఫలితం తెలంగాణ.. ఎమ్మెల్యే దివాకర్ రావు

మంచిర్యాల టౌన్, (ప్రభ న్యూస్) : ఎందరో వీరుల త్యాగాల ఫలితంగ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హమాలివాడలో ఏర్పాటుచేసిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథులుగా మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్యతో కలిసి పాల్గొన్నారు. మొదట రైల్వే గేట్ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముందుగా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి గొంతెత్తి నినాదించినారు అన్నారు.

- Advertisement -
   

ఈ సమయంలోనే 2001 ఏప్రిల్, 21న ముఖ్యమంత్రి కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజినామచేసి మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేసారని అన్నారు. తెలంగాణ ప్రజల హృదయాలు ఆనందం, గర్వింతో నింపుకున్న సందర్భం ఇద‌ని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణా ప్రజలు గర్వించే క్షణం అన్నారు. ఆవిర్భావ దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో అన్ని వర్గాల వారు పాల్గొన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది యువకులు, విద్యార్థులు తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమ అమరవీరులకి వారి అంకితభావానికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ ఎర్రం తిరుపతి , బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోగుల రవీందర్ రెడ్డి,14 వ వార్డు కౌన్సిలర్ పోరెడ్డి రాజు, 15 వ వార్డు కౌన్సిలర్ శ్రీరాముల సుజాత-మల్లేష్, 5 వ వార్డు కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ, 32 వ వార్డు కౌన్సిలర్ గాదె సత్యం కో-ఆప్షన్ సభ్యులు జాఫర్ హుస్సేన్, మాజీ కౌన్సిలర్ బగ్గని రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement