Saturday, September 30, 2023

Mancheriala : తొమ్మిదేళ్లలో ఎనలేని ప్రగతి.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్

భారతదేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ తెలియజేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. 9 ఏళ్లలో ఎనలేని ప్రగతి సాధించామని, ఇతర రాష్ట్రాలు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆయా రాష్ట్రాల్లో అమలు చేయడమే తమ పనితీరుకు నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య, డీసీపీ సుధీర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్ తో పాటు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement