Thursday, November 14, 2024

ఇల్లు కూల్చారని మనస్తాపం.. అధికారుల ఎదుటే బాధితుడు ఆత్మహత్య

భూపాలపల్లిలో అక్రమంగా నిర్మించారని సుధాకర్ అనే వ్యక్తి ఇంటిని అధికారులు కూల్చారు. దీంతో అధికారుల ఎదుటే బాధితుడు పురుగుల మందును తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అయినా కూడా అధికారులు అడ్డుకోలేదు. ఆస్పత్రికి తరలించడంలో సైతం ఆలస్యం చేయడంతో చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు. అధికారులు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎదుటే సుధాకర్ పురుగుల మందు తాగాడు. ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆత్మహత్యకు ముందు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక భాగంలో నివాసం ఉంటున్న తన ఇంటి స్థలాన్ని రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో మంగళవారం రాత్రి బాధితుడు సుధాకర్ మనస్థాపంతో పురుగుల మందు సేవించాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం భూపాలపల్లి మండలంలోని కాసింపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ మామ దుర్గయ్య పేరుమీద రెవెన్యూ అధికారులు గతంలో ఇంటి స్థలంకు సంబంధించి పట్టా పంపిణీ చేశారు. అయితే తనకు కేటాయించిన స్థలంలో దుర్గయ్య అల్లుడు జోరు సుధాకర్ ఇల్లు నిర్మించుకున్నారు. అయితే, మున్సిపల్, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించకూడదని ఆదేశించారు. డిగ్రీ కళాశాల సమీపంలో స్విమ్మింగ్ పూల్, మినీ ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు ప్రజా ప్రతినిధులు అధికారులు ఇటీవల శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో స్థలం సరిపోవడం లేదనే కారణంతో సుధాకర్ కు కేటాయించిన స్థలాన్ని చదును చేశారు. దీంతో మనస్థాపం చెంది సుధాకర్ పురుగుల మందు సేవించాడు. బాధితుని సుధాకర్ ను బంధువులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement