Sunday, October 17, 2021

మల్లన్న అందాలు.. ఎక్క‌డో తెలుసా!

  • 3, 467 హెక్టార్లలో వనం.. ఔషధ మొక్కలకు ప్రాధాన్యం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కాలుష్యం, జనావాసాలతో విసిగిపోయిన నగర ప్రజలు సేదతీరడానికి పచ్చని అడవి వైపు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే దక్షణాన నల్ల మల్ల, ఉత్తరాన దండకారణ్యాన్ని ఆనుకొని ఉన్న అదిలాబాద్‌ నుంచి భద్రాద్రి కొత్తగుడెం వరకు దట్టమైన అడవులు పర్యా టకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటికి తోడుగా ప్రకృతి ప్రేమికుల మనస్సులను ఆకర్శించటానికి మరొక అట వీ ప్రాంతం తన అందాలతో ఎదురుచూస్తోంది. సిద్దిపేట జిల్లా లోని రిజర్వ్‌ అటవీ ప్రాంతంలో దాదాపుగా 3,467.02 హెక్టా ర్లను మల్లన్న వనంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచి స్తోంది. ఇందుకోసం రూ.9 కోట్లు మల్లన్న వనాల అభివృద్ధి కోసం విడుదల చేశారు. ఆయుర్వేద వన మూలికలు, వాచ్‌ టవర్లు, కుంటల అభివృద్ధి, వన్య ప్రాణుల సంరక్షణ కోసం చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

అడవికి నీటి దుప్పటి కప్పినట్లుగా… మల్లన్నసాగర్‌ జలాశయంతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మి ంచిన కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్‌ మల్లన్న సాగర్‌. 50టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వా యర్‌లోకి ఇటీవలే ప్రాథమికంగా గోదావరి జలాలు విడుదల చేశారు. సిద్దిపేట జిల్లాలోని రిజర్వ్‌ అటవీ ప్రాంతంలోనే ఈ ప్రాజెక్టు నిర్మించారు. మెత్తం 4,794.47 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అటవీ ప్రాంతంలో మల్లన్నసాగర్‌ నిర్మాణానికి 1,3 27.45 హెక్టార్లని వినియోగించారు. మిగిలిన 3,467.02 హెక్టా ర్లలో మల్లన్న వనాలుగా తీర్చిదిద్ది మంచి పర్యాటక ప్రాం తంగా మార్చేందుకు అటవీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం గ్రామం నుంచి 20 కి.మీ. మేర అటవీ ప్రాంతం గుండా వెళ్తే మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ వెనుక జలాలు ఈ అటవీ ప్రాంతం చుట్టూ అందంగా ఆవరించి కనువిందు చేస్తుంది. పచ్చటి అడవికి నీలి రంగు నీళ్ళతో దుప్పటి కప్పినట్లుగా ఉండే ఈ దృష్యం చూప రులను అమితంగా ఆకట్టుకుంటుంది. మల్లన్న జలాల నడు మ మల్లన్న వనాలను చూసేందుకు ఈ జలాశయంలో బోటింగ్‌ ప్రారం భిం చాలని ప్రణాళికలు చేస్తున్నారు.

ఔషద ‘మల్లన్న’ వనం…
తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ఆదేశం మేరకు అటవీ వున రుజ్జీ వనంలో భా గంగా ఖాళీ భూ మిలో వివిధ ర కాల మొక్క ల ను నాటే కార్యక్ర మాన్ని అటివీ అధికారులు ము మ్మరంగా చేప డుతు న్నారు. అందులో భాగంగా మల్ల న్న వనంలో పెద్ద ఎ త్తున ఆయుర్వేద మొక్క లను పెం చుతు న్నా రు. అటవీ ప్రాం తం కోతులకు గురి కా కుండా ఎక్క డిక క్కడ కందకాలు తీసి వాటి గట్లపైన రకర కాల మొక్కలు నా టా రు. ప్రధా నంగా కల బం ద, తులసి, వెదు రు, తిప్పతీగ, అల్ల నేర డి, పొడపత్రి, ఫామా రోజ్‌గడ్డి, నిమ్మ గడ్డి తదితర మొక్కలు ఇం దులో ఉన్నా యి. అట వీ వున రుద్దర ణలో భా గంగా టేకు మొక్కలు, వేప అడవి నాబి తది తర మొక్క లు పెరి గా యి. ఈ వనాల్లో ఔష ధ మొక్కలు ఎక్కువ స ంఖ్యలో ఉండేలా చూ స్తున్నారు. అటవీ ప్రాం తంలో ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉన్నా.. వివిధ రకాల మొక్క లు నాటి మల్లన్న వ నాలను పెంచు తు న్నా రు.

చిరుతలు తిరిగే చిక్కటి అడవి…
ఈ ప్రాంగణం అంతా.. దట్టమైన అటవీ ప్రాంతం కావ డంతో వివిధ రకాల వన్య ప్రాణులు అధిక సంఖ్యలో ఉన్నా యి. ఇటీవలే ఈ ప్రాంతంలో చిరుత సంచారాన్ని కూడా అధి కారులు గుర్తించారు. సహజంగానే ఈ ప్రాంతంలో ఎన్నో రకా ల జంతువులు సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధా నంగా అడవిపందులు, కొండగొర్రెలు, నెమళ్లు, సింకలు, కుం దేళ్ల సంచారణ అధికంగా ఉంటుంది. వేసవి కాలంలో వన్య ప్రాణుల కోసం ఈ ప్రాంతంలో అనేక కుంటలు, చెరువులు ఉన్నాయి. వీటిలో దట్టమైన అటవీ ప్రాంతంలోని గుట్టల నడు మ అంకారెడ్డి చెరువు సందర్శకులను కట్టిపడేస్తుంది. దీని లోతు 65 అడుగులకు పైగా ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు. అర కిలోమీటరుకు పైగా పొడువున్న ఈ చెరువులో ప్రస్తుతం 1.5-2 టీఎంసీల నీళ్లు ఉండొచ్చని సిద్ధిపేట జిల్లా అటవీ అధికారి శ్రీధర్‌ తెలిపారు. దీనితో పాటు ఈ అభయా రణ్యంలో సుమారుగా 150 వరకు చిన్న చిన్న కుంటలను గుర్తించారు. ఎక్కడి నీళ్లు అక్కడే నిలిచేలా కుంటలను పున రుద్ధరించారు. దీంతో కుంటలన్నీ నిండుకుండల్లా కళకళలా డుతున్నాయి. అడవిలో 15 చెక్‌డ్యాంలు నిర్మించారు. దీంతో భూగర్భ జలాలు వృద్ధి చెందుతున్నాయి. ప్రస్తుతం అటవీ ప్రాంతంతో చాలా వరకు నీటి ఊటలు పెరిగి జాలువారుతు న్నాయి. వర్షాకాలం ముగుస్తున్న ఈ సమయంలో జల పాతాలు, పచ్చని చెట్లు పర్యాటకులను కట్టిపడేస్తాయి. సాహస ప్రేమికులు కూడా ఈ పర్యాటనను ఎంతో ఇష్టపడతారు.

అభివృద్ధికి రూ.9 కోట్లు
మల్లన్న వనాల పక్క నుంచే రాజీవ్‌ రహ దారి వెళ్తుం డటంతో హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వచ్చేందుకు సులు వుగా ఉంటుంది. సిద్దిపేట జిల్లాలో రాజీవ్‌ రహదారిని ఆనుకొని ఉన్న ఈ అటవీ ప్రాంతం లోకి వెళ్లడానికి కొండపాక మండలం లకు డారం గ్రామ శివారు నుంచి రహదారి నిర్మాణానికి అధికారులు ప్రణాళి కలను సిద్ధం చేశారు. ప్రస్తుతం 1.5 కి.మీ.ల పొడవైన రహదారి నిర్మాణానికి ఇటీవల నిధులు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. హైదరాబాద్‌ నుంచి సుమారు 90 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ అభయారణ్యం వీకెండ్‌ సాహస ప్రేమి కులను అమి తంగా ఆకర్శిస్తోంది. మల్లన్న వనాల అభివృద్ధి పనుల నిమి త్తం మొత్తం రూ.9 కోట్లతో ప్రతిపాదనలు ప్రభాత్వానికి పంపి నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రోడ్డు నిర్మాణంతో పాటు ఎత్తయిన ప్రాంతంలో వాచ్‌ టవర్లు నిర్మి ంచాలని అధి కారులు నిర్ణయిం చారు. అటవీ, పర్యా వరణ పర్యవే క్షణ కు, పర్యాటకుల వీక్షణకు ఈ వాచ్‌ టవర్లు ఉపయో గపడుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News