Thursday, April 25, 2024

వరి కొనుగోలు పై అవగాహన సదస్సు..

అడ్డాకుల : మండల పొన్నకల్‌ గ్రామంలో వరి కొనుగోలుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపిపి దోనూర్‌ నాగార్జున రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని తెలిపారు. రైతులు పండించిన వరి ధాన్యం తేమ శాతం కలిగి ఉండి చెత్త ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. రైతులు సమన్వయంతో ఉండి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్‌ కల్పనా విజయకుమార్‌ రెడ్డి, అడ్డాకుల సింగిల్‌ విండో డైరెక్టర్‌ కావలి కృష్ణయ్య , ఏఈఓ చక్రవర్తి , రైతుబంధు గ్రామ అధ్యక్షులు పుల్లయ్య గౌడ్‌ , మన్యంకొండ యాదవ్‌ , వి.ధర్మారెడ్డి , కావలి సాయిలు , కర్నె వెనయా , శ్రీశైలం , వార్డు మెంబర్లు , గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement