Tuesday, October 19, 2021

పోలీసులతో చిచ్చరపిడుగు

మైనర్ బాలుడు ఎలక్ట్రిక్ బైక్ పై స్నేహితున్ని ఎక్కించుకుని రయ్యిన వెళ్తుండగా పోలీసులు ఆపి వివరాలు అడుగుతున్నప్పుడు ఆ బాలుడు మాట్లాడిన తీరు అందరికీ విస్మయానికి గురిచేసింది.

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కనీసం బైక్ పైనుండి దిగకుండానే నోట్లో బబుల్ గమ్ నములుతూ సమాధానం ఇచ్చాడు. దీనితో కుటుంబ సభ్యులను పిలిపించి సున్నితంగా మందలించి వదిలివేశారు. చిన్నతనంలోనే పెద్దలతో ఎలా మాట్లాడాలో పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించాలని పోలీసులు కోరుతున్నారు. మైనర్ పిల్లలకు వాహనాలను ఇచ్చి రోడ్లపైకి పంపిస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News