Wednesday, April 14, 2021

పాఠ్య పుస్తకాల పరిశీలన..

దేవరకద్ర : మండల కేంద్రంలో స్థానిక దేవాలయ ప్రాంగణంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల ఆన్లైన్‌ పాఠ్యూపుస్తకాలను బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠశాలను చక్కగా చదువుకోవాలని ఆమె విద్యార్థులను కోరారు. రెండవ దఫా కరోనా వైరస్‌ ఉన్నందువల్ల ప్రభుత్వం ఇటీవల పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. దీని వలన విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వార పాఠాలు నేర్చుకోవాలని ప్రభుత్వం కోరడం జరిగింది. ఆన్‌లైన్‌ ద్వార పాఠాలు నేర్చుకున్న విద్యార్థుల పాఠ్య పుస్తకాలను ఉపాధ్యాయులు తనిఖీలు చేశారు. విద్యార్థులు ఇలాగే ఆన్‌లైన్‌ ద్వార పాఠాలు నేర్చుకొని పదో తరగతిలో ఉత్తీర్ణులు కావాలని ఆమె కోరారు. బాలికల పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Prabha News