Friday, October 11, 2024

MBNR: చెట్టును ఢీకొన్న స్కూల్ బస్.. విద్యార్థులకు తప్పిన ప్రమాదం..

గద్వాల ప్రతినిధి, సెప్టెంబర్ 17 (ప్రభ న్యూస్) : జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలకు చెందిన ప్రగతి విద్యా నికేతన్ ప్రైవేట్ స్కూల్ బస్సు ప్ర‌మాదానికి గురైంది. మల్దకల్ మండలం, మద్దెలబండ గ్రామం నుంచి స్కూల్ పిల్లలతో గద్వాలకు వస్తుండగా పరుమాల గ్రామ స్టేజి సమీపంలో బస్సు బ్రేకులు ఫెయిల్ కావ‌డంతో అదుపుతప్పి చెట్టును డీకొన్నట్లు తెలుస్తోంది.

బస్సులో సుమారు 40మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఎవరికి ఎలాంటి అపాయం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement