Thursday, March 28, 2024

ఘనంగా సత్యసాయి 96వ జన్మదిన వేడుకలు

అచ్చంపేట,రూరల్, (ప్రభ న్యూస్): అచ్చంపేట పట్టణంలో భగవాన్ సత్యసాయి బాబా 96వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరివిందని సత్యసాయిబాబా సేవా సమితి కన్వీనర్ వెంకటేష్, బాదం క్రిష్ణయ్య లు తెలిపారు. పట్టణంలో ఈరోజు ఉదయం గం.5లకు సుప్రభాతం అనంతరం పట్టణంలోని పురవీధుల్లో నగర సంకీర్తనతో బయలుదేరి గం.7లకు సాయిబాబా వేదమంత్రాలతో పతాకావిష్కరణ‌ చెయ్యడం జరిగింది. అనంతరం గం.11లకు వృద్దులకు అనాదలకు బట్టలు, దుప్పట్లు, పంపిణీ చేసి సత్యసాయిబాబా వ్రతం నిర్వహించారు.

సాయంత్రం ఐదు గంటలకు సత్యసాయి బాబా పల్లకి సేవ ఊరేగింపుగా కోలాటాలు, భజన కీర్తనలు ఆలపిస్తూ పట్టణంలోని పురవీధుల్లో వెళ్లడం జరిగింది. రాత్రి ఏడు గంటలకు నామ సంకీర్తన అనంతరం బాలవికాస్ చిన్నారులతో నృత్యాలు చేస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు శ్రీను, అశోక్, రమేష్, ఆచారి, నాగరాజు, అమృతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement