Wednesday, April 14, 2021

సర్పంచ్‌..కార్యదర్శిని సన్మానం..

మహబూబ్‌నగర్‌ : మూసాపేట మండల పరిధిలోని చక్రాపూర్‌ లో గ్రామ సర్పంచ్‌ శైలజ రెడ్డిని.. కార్యదర్శి సతీష్‌ రెడ్డిని ఉపాధ్యాయుల బృందం సన్మానించారు. ఉత్తమ గ్రామ పంచాయితీ అవార్డు అందుకున్న సందర్భంగా ఉపాధ్యాయ బృందం వారిని సన్మానించారు. అంతేకాకుండా గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శంషాద్‌ దీన్‌ , గోపాల్‌ నారాయణ , వసీం , రమేష్‌ , గ్రామస్తులు కురుమూర్తి , ఆంజనేయులు ,మహేష్‌ , హనుమంతు , తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News