Thursday, April 25, 2024

వైద్య సిబ్బందికి మాస్కులు, శానిటైజర్ల పంపిణీ

వనపర్తి – కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలని శ్రామిక వికాస కేంద్రం డైరెక్టర్ లక్ష్మణరావు అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రామిక వికాస కేంద్రం ఆధ్వర్యంలో వనపర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లోని వైద్య సిబ్బందికి మాస్కులు, శానిటైజర్ , హ్యాండ్ వాష్, బ్లౌజులు, సోప్స్ అందజేయడం జరిగింది. కరోణ విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వైద్యం చేస్తున్న వైద్య సిబ్బంది కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండేందుకు మాస్కులు, శానిటైజర్ లను పంపిణీ చేయడం జరిగిందని లక్ష్మణరావు అన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య గౌడు,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement