Thursday, September 26, 2024

MBNR: ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. ఒకరు మృతి..

పెబ్బేర్ రూరల్, సెప్టెంబర్ 17 (ప్రభ న్యూస్) : పెబ్బేర్ మున్సిపల్ పరిధిలో గల రంగాపురం గ్రామం సమీపంలో వీఎస్టీ కంపెనీ దగ్గర హైదరాబాద్ నుండి కర్నూలు వెళుతున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు బైకును ఢీకొటిన సంఘటన ఇవాళ‌ రంగాపురం దగ్గర చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే… రంగాపురం గ్రామానికి చెందిన పెళ్లి రాముడు, శేఖర్ లు ఇద్దరు బైక్ పై వీఎస్టీ కంపెనీ పక్కనున్న వ్యవసాయ పొలం దగ్గరికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పెళ్లి రాముడు అక్కడికక్కడే మృతిచెందగా, శేఖర్ కు తీవ్ర గాయాలై పరిస్థితి విషమించడంతో 108 అంబులెన్స్ ద్వారా వనపర్తి ఏరియా హాస్పిటల్ కి తరలించినట్లు స్థానికులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement