Friday, September 22, 2023

మిషన్ కాకతీయతో ఊపిరి పోసుకున్న చెరువులు.. మర్రి జనార్ధన్ రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (జూన్ 8) ప్రభా న్యూస్ : మిషన్ కాకతీయ పథకం ద్వారానే చెరువులు ఊపిరి పోసుకున్నాయని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. గురువారం పాలెం పెంటోని చెరువులో గంగమ్మకు, కట్ట మైసమ్మ తల్లికి, చెరువుకు పూజ చేసి చెరువులో మరబోటులో తిరిగి చెరువులను పరిశీలించారు.

- Advertisement -
   

అనంతరం ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ… నేడు చెరువుల పండుగ చేసుకుంటున్నామంటే నాడు కేసీఆర్ మదిలో పుట్టిన మిషన్ కాకతీయ పథకం ద్వారానే అని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. చెరువుల నుండి రైతులు, బెస్త, ముదిరాజు, తెలుగు కులాలవారు ప్రభుత్వం ఇచ్చిన ఉచిత చేపలు పెంచుకొని ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కిరణ్, ప్రధాన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement