Tuesday, March 19, 2024

ఇది ప్రజా విజయం – డీ. సి. సి అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ

అచ్చంపేట, అచ్చంపేట పురపాలక సంఘం ఎన్నికలలో 20 వార్డులకు గాను కాంగ్రెస్ ఆరు సీట్లను గెలుపొందడం హర్షణీయమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. సోమవారం ఆయన అచ్చంపేటలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెసు ఆరు స్థానాలు గెలుపొందడం ఇది ప్రజా విజయమని ఆయన అన్నారు. గత మున్సిపల్ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడం వల్ల పట్టణ ప్రజలు టిఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. కాంగ్రెస్, 6 బిజెపి,ఒకరు గెలుపొందడం అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పతనానికి నాంది అని ఆయన ఎద్దేవా చేశారు. నీతికి అవినీతికి న్యాయానికి అన్యాయానికి ధర్మానికి అధర్మానికి జరిగిన ఎన్నికల్లో 20 కి 20 స్థానాలు గెలుస్తామని చెప్పిన టిఆర్ఎస్ కు పట్టణ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అడ్డదారిలో పొందడానికి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు ఆర్థికంగా ఉన్న వారిని కాంట్రాక్టులను, రియల్టర్ల ను, అభ్యర్థులుగా రంగంలోకి దింపిన టిఆర్ఎస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన టిఆర్ఎస్ కు ఇక ముందు ముందు గడ్డుకాలం అని అన్నారు. కాంగ్రెస్ కు మంచి రోజులు వస్తున్నాయి అని కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరుపున గెలుపొందిన గార్లపాటి శ్రీనివాసులు, గౌరీ శంకర్, నూరి వేగం, సునీత చిట్టెమ్మ,మందునాగుల సంధ్య, నాయకులు గోపాల్ రెడ్డి, అనంత రెడ్డి, శ్రీనివాసులు, అంజి, చంద్రమోహన్, అజయ్, మల్లికార్జున్, సునీల్, తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement