Wednesday, May 19, 2021

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం..

కోస్గి : నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పిడిఎస్ బియ్యం పక్కదారి పట్టింది. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం డీసీఎం ను పట్టుకున్నారు. ఎస్ ఐ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం అక్రమంగా పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్న డీసీఎంను కోస్గి లో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అక్రమ రేషన్ బియ్యం వికారాబాద్ నుండి గుర్మిట్కల్ కు తరలిస్తున్నట్లు దౌల్తాబాద్ మండలం అంతారం గ్రామానికి చెందిన యజమాని మల్లేష్ తెలిపారని, అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం సుమారు 85 క్వింటాళ్ల వరకు ఉంటుందని డిటి హేమ్లా నాయక్ తెలిపారు. డి టి హేమ్లా నాయక్ ఆధ్వర్యంలో విచారించి యజమాని మల్లేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News