Wednesday, April 24, 2024

భౌతిక దూరాన్ని పాటించని ప్రజలు…

దేవరకద్ర : మండల కేంద్రంలో స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయం ఆవరణలో.. అదే విధంగా పశువుల సంతలో ,బజార్‌లో కూరగాయల మార్కెట్‌ లో ప్రజలు మాస్కులు ధరించకుండా విచ్చలవిడిగా గుంపులుగా తిరుగుతున్నారు. ఒక పక్క రెండవ విడత కరోనా వైరస్‌ ఉధృతంగా వ్యాపిస్తున్నా కూడా ప్రజలు ఏ మాత్రం లెక్కచేయకుండా తిరుగుతున్నారు. రోజు రోజుకు మండలంలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నా కూడా కనీసం ప్రజలు భౌతిక దూరాన్ని కూడా పాటించడం లేదు. కిరాణా షాపుల్లో కానీ , బట్టల షాపుల్లో కానీ , కూరగాయల మార్కెట్లో గాని ప్రజలు భౌతిక దూరం పాటించకుండానే వ్యాపారాల యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఒకపక్క అధికారులు , మరోపక్క ప్రజా ప్రతినిధులు ఎన్ని సార్లు చెప్పినా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రజలు పక్క దోవ పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు శ్రద్ద తీసుకుని ప్రతి ఒక్కరు కూడా కరోనా కట్టడి కోసం మాస్కు ధరించి , భౌతిక దూరాన్ని పాటించాలని అధికారులు కోరుతున్నారు. మాస్కు లేని వారికి కూడా అధికారులు జరిమానాలు విధిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement