Tuesday, October 29, 2024

మోడీ పాల‌న‌లో అన్ని రంగాలు ప్రైవేటు ప‌రంః మంత్రి నిరంజ‌న్ రెడ్డి..

వ‌న‌ప‌ర్తి : ప‌్ర‌భుత్వ‌ సంస్థ‌ల‌ను ప్రైవేటు ప‌రం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా మోడీ స‌ర్కార్ ఏడేండ్ల కాలంలో ప‌ని చేసింద‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. శాసనమండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలకేంద్రంలో పట్టభద్రులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే లక్షా 50 వేల ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లు తెలిపారు. మరో 50 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ వెలువ‌డ‌నున్న‌ట్లు చెప్పారు. పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అనుకూలం అన్నారు. టీఎస్ ఐపాస్ దేశానికే ఆదర్శమ‌న్నారు. హైదరాబాద్ నుండి దేశంలోని అన్ని రాష్ట్రాలకు రైలు, ప్రపంచంలోని అన్ని దేశాలకు విమాన సదుపాయం ఉంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement