Sunday, April 11, 2021

నేలకొండపల్లి రింగ్ రోడ్డుకు నిధులు..

ఖమ్మం : నేలకొండపల్లికి రింగ్ రోడ్డుగా 23 కిలోమీటర్ల రోడ్డుకు రూ.23 కోట్లు మంజూరయిందన్నారు టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నేలకొండపల్లి మండల రైతాంగానికి తీపి కబురు చెప్పారు. అభివృద్ధి చేసే ప్రభుత్వం ఉన్నందున నాడు పాలేరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అధికారులతో మాట్లాడి అభివృద్ధి పనులు చేయించగలుగుతున్నానని అన్నారు. నేలకొండపల్లి మండలం అన్ని గ్రామాల రైతాంగానికి రింగు రోడ్డు ఎంతో శ్రేయస్కరమన్నారు. వేసవిలోనే రింగు రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం కావచ్చునన్నారు. తుమ్మల నాగేశ్వరావు నేలకొండపల్లి మండలం, గువ్వలగూడెంలో రైతులతో మాట్లాడి బోదులబండ కోటమైసమ్మ నూతన దేవాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News