Friday, May 7, 2021

మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నరసింహ గౌడ్?

అచ్చంపేట, : అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్న టిఆర్ఎస్ పార్టీ నుండి 16 వ వార్డులో కౌన్సిలర్గా విజయం సాధించిన ఎడ్ల నరసింహ గౌడ్ ను చైర్మన్ పదవికి ఎంపిక చేశారని సమాచారం. మొదటి నుండి చైర్మన్ అభ్యర్థిగా ప్రచారం పొందిన నరసింహ గౌడ్ ను ఎట్టకేలకు చైర్మన్ గా బరిలో ఉన్నారని తెలుస్తుంది. ఇంతకు ముందు టిఆర్ఎస్ పార్టీలో చైర్మన్ అభ్యర్థిగా 11వ వార్డు నుండి అరుణ పేరు వినిపించింది దీంతో ఆమె ఆ వార్డులో స్వల్ప తేడాతో ఓడిపోవడంతో చైర్మన్ పదవికి నరసింహ గౌడ్ అని పార్టీ వర్గాలు మాట్లాడుకోవడం జరుగుతుంది. దీంతో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా నరసింహ గౌడ్ చైర్మన్ పదవికి ఎంపిక చేసినట్లుగా పలువురు చర్చించుకుంటున్నారు. టిఆర్ఎస్ కు మొదటి నుండి కార్యకర్తగా పని చేసిన నరసింహ గౌడ్ కు తగిన గుర్తింపు ఉంది. పార్టీలో సీనియర్ కార్యకర్తగా పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేసిన నరసింహ గౌడ్ ను చైర్మన్ గా ఎంపిక చేయడం సమంజసమేనని పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.పలకపల్లి సర్పంచిగా ఐదు సంవత్సరాలు పనిచేసిన నరసింహ గౌడ్, అన్ని విధాలుగా చైర్మన్ పదవికి అర్హుడు అని పలువురు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. పార్టీలో వివాదాలకు దూరంగా ఉంటూ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేసిన నరసింహ గౌడ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News