Saturday, December 7, 2024

అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక, మెరుగైన వైద్య సేవలు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్: అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక, మెరుగైన వైద్యసేవలు అందించనున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ ను సీఎం కేసీఆర్ సహకారంతో మెడికల్ టూరిజంగా అభివృద్ధి చేసేందుకు అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రఖ్యాతి గాంచిన ఉమ్మడి జిల్లాకు చెందిన డాక్టర్లు అంతర్జాతీయ స్థాయిలో వారు పుట్టిన గడ్డకు వైద్య సేవలు అందించేందుకు డా.శ్రీని గంగాపాని ఆధ్వర్యంలో ఈ వరల్డ్ గ్లోబల్ డాక్టర్స్ అసోసియేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ గ్లోబల్ డాక్టర్స్ జూమ్ మీటింగులో ఈరోజు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి.శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ అదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లాలో ఇకపై సరైన వైద్యం అందక మరణించే ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో మహబూబ్ నగర్ జిల్లాలో ఆధునిక, మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రముఖ డాక్టర్లు, స్థానిక మహబూబ్ నగర్ జిల్లాలో సేవలందించనున్నట్లు తెలిపారు. అందుకు ఆ డాక్టర్లతో కలసి కన్సల్టింగ్ వైద్య సేవలు అందించేందుకు ఈ సేవ క్లినిక్ ను జనవరి – 2023లో ప్రారంభిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహబూబ్ నగర్ ను కేసీఆర్ సహకారంతో మెడికల్ టూరిజంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో మెడికల్ టూరిజం అభివృద్ధి పై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావులతో కలసి చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ జూమ్ మీటింగ్ లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వివిధ దేశాల్లోని ప్రముఖ డాక్టర్లు, జిల్లాకు చెందిన డాక్టర్లు IMA ప్రెసిడెంట్ డాక్టర్. రామ్మోహన్, డా. మధుసూదన్ రెడ్డి, డా.శామ్యూల్, డా.శరత్ చంద్ర, డా.వంశీ కృష్ణ, రవి చందర్, CEO – సాఫ్ట్‌పాత్ సిస్టమ్స్, డా. విజయ్ కాంత్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డా.జీవన్, డా.మహేష్ బాబు, డా. నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement