Wednesday, December 11, 2024

TG | ఏసీబీ వలలో మహబూబ్ నగర్ డీఈఓ…

ఉపాధ్యాయుడి వద్ద రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు


మహబూబ్ నగర్, నవంబర్ 7 (ఆంధ్రప్రభ) : మహబూబ్ నగర్ జిల్లా డీఈవో రవీందర్ గురువారం ఏసీబీ వలకు చిక్కారు. ఒక ఉపాధ్యాయుడికి దక్కవలసిన సీనియారిటీ దక్కకపోవడంతో తనకు న్యాయం చేయాలని పలుమార్లు డీఈఓను కలవగా రూ.50 వేలు లంచం కావాలని డీఈఓ రవీందర్ డిమాండ్ చేశారు.

ఆ ఉపాధ్యాయుడు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ ను ఆశ్రయించారు. పథకం ప్రకారం గురువారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో ఉన్న డీఈవో ఇంటికి ఉపాధ్యాయుడు వెళ్లి 50 వేల రూపాయలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ బృందం డీఈఓను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement