Saturday, December 7, 2024

MBNR: సమస్యలపై రోడ్డెక్కిన కేజీబీవీ విద్యార్థులు… మూడు గంటల పాటు ధర్నా

కోస్గి, ఆగస్టు 3( ప్రభ న్యూస్): నీళ్ల చారు… ఉడకని అన్నంతో నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కస్తూర్బా విద్యార్థులు రోడ్డెక్కారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని నాచారం గ్రామంలో ఉన్న కేజీబీవీ పాఠశాలలో సౌకర్యాలు కల్పించడం లేదని, విద్యార్థులకు సరైన మెనూ పాటించడం లేదని, ఎస్ఓ తమతో దురుసుగా ప్రవర్తిస్తుందని, తల్లిదండ్రులను సైతం కలవనీయదని, వెంటనే ఎస్ఓను తొలగించి తమకు న్యాయం చేయాలని విద్యార్థులు తాండూర్ – మహబూబ్ న‌గర్ రోడ్డుపై బైఠాయించారు.

కలెక్టర్ రావాలి, న్యాయం చేయాలి, కలుషిత ఆహారం వద్దు – పౌష్టికాహారం ముద్దు, అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు రోడ్డుపై మూడు గంటల పాటు బైటాయించి ఎస్ఓను తొలగిస్తే తప్ప తాము వెళ్ళేది లేదని, విద్యార్థులు నినాదాలు చేస్తూ భీష్మించుకొని కూర్చోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.

- Advertisement -

సీఐ దస్రు నాయక్ , ఎస్సై బీవీ రమణ అక్కడికి చేరుకొని ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. సీఐ, మాజీ సర్పంచ్ వెంకట్ రాములు త‌హ‌సీల్దార్ తో మాట్లాడిస్తామని విద్యార్థులకు నచ్చజెప్పడంతో అక్కడి నుండి త‌హ‌సీల్దార్ కార్యాలయానికి విద్యార్థులను తీసుకెళ్లారు. అప్పటికే అక్కడికి చేరుకున్న జీసీడీఓ పద్మనలిని విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement