Thursday, April 25, 2024

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ..

మల్దకల్ : జోగులాంబ జిల్లా మల్దకల్ మండలం లోని మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. మల్దకల్ సంబంధించిన 82 మందికి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ చేతులమీదుగా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల పథకం ప్రకారమే ఆసరా పింఛన్ రైతుల కొరకు రైతుబంధు, రైతు భీమా 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది.గతంలో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే పెద్ద వ్యాపారస్తుల తో అప్పు చేసి పెళ్లి చేయాల్సిన పరిస్థితి ఉండేది నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి ఎస్సీ ఎస్టీ ,బిసి, మైనార్టీ ఆడపిల్లలకు అన్ని వర్గాల ప్రజలకు కు అన్న గా అండగా ఉంటానని కల్యాణలక్ష్మి రూపంలో మొదటి 50,000 నుంచి, నేడు లక్ష నూట పదహారు రూపాయలు అందజేసి ఇవ్వడం ఆడపడుచు అండగా పెద్దన్నగా నిలిచారు పెళ్లి సమయంలో ఒక వేళ అప్పు చేసిన అప్పులు తీర్చి ధైర్యం తల్లిదండ్రులకు ఇచ్చిలోని అండగా నిలిచిన నాయకుడు కెసిఆర్ కళ్యాణ లక్ష్మి రూపంలో వారికి ఆదుకుంటున్నామన్నారు. రైతు కోసం రైతు బంధు, రైతు బీమా, రైతు సమావేశం ఏర్పాటు చేశారు రైతు వేదిక నిర్మాణం చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరు సంతోషంగా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని సీఎం కోరిక అని తెలిపారు .మహిళలు ఈ కళ్యాణలక్ష్మి డబ్బులను వృధా చేయకుండా అవసరానికి వినియోగించుకోవాలని కోరారు.ఈ సందర్భంగా మహిళలు ముఖ్యమంత్రికి, స్థానిక ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి,సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ప్రహ్లాద రావు, తహసిల్దార్ మీర్ అజం అలీ, ఎంపిడివో కృష్ణయ్య మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శేషం పల్లి నరసింహులు, సింగల్ విండో వైస్ చైర్మన్ విష్ణు, మాజీ జెడ్పీటీసీ భాస్కర్, వివిధ గ్రామాల సర్పంచ్లు, యాకోబు, నారాయణ, అంజి, అంజి, విరేష్, పురుషోత్తం రెడ్డి,, శివరాం రెడ్డి, భరత్ రెడ్డి, ఎంపిటిసిలు , తెరాస పార్టీ నాయకులు తూము కృష్ణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కో-ఆప్షన్ మహబూబ్ అలీ, నరసింహారెడ్డి, రామచంద్ర రెడ్డి, వెంకటన్న, మధు, నరేందర్, ప్రవీణ్, మాజీ సర్పంచ్ సవరప్ప, యూత్ నాయకులు పెద్దపల్లి అజయ్, భాస్కర్ గౌడ్, కో,, ఆప్షన్ హైదర్ సాబ్ తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement