Friday, April 26, 2024

పాత్రికేయులకు హెల్మెట్‌లు..

దేవరకద్ర : నియోజకవర్గ పరిధిలోని చిన్నచింతకుంట మండల కేంద్రంలో పాత్రికేయులకు అలాగే పెద్ద వడ్డెమాన్‌ గ్రామంలో యువకులకు హైకోర్టు న్యాయవాది.. టిపిసిసి కార్యదర్శి మధుసూదన్‌ రెడ్డి హెల్మెట్‌లు క్రికెట్‌ కిట్‌ పంపిణీ చేశారు. యువకులు క్రికెట్‌ కిట్‌ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పాత్రికేయులు ఎండలో వార్తా సేకరణకు వెళుతుంటారు. కాబట్టి వారు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు హెల్మెట్‌లను పంపిణీ చేయడం జరిగిందని , దీనిని పాత్రికేయులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు , పాత్రికేయులు , యువకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement