Tuesday, December 3, 2024

MBNR: ప్రజావాణిలో రైతు ఆత్మహత్యాయత్నం..

గద్వాల (ప్రతినిధి) జూలై 1 (ప్రభ న్యూస్) : క‌లెక్ట‌రేట్ లోని ప్ర‌జావాణిలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన ఘ‌ట‌న జోగులాంట గ‌ద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. అల్లంపూర్ నియోజకవర్గం, ఐజా మండలం, గుడిదొడ్డి గ్రామంలో రైతు పరశురాముడుకు చెందిన సర్వే నంబర్ 321లో 5ఎకరాల భూమిని ఇదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేశారని, ఈ విషయాన్ని ఐజా త‌హ‌సీల్దార్ కు, జిల్లా కలెక్టర్ కు పలు సందర్భాల్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఇవాళ కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి ముందు రైతు పరశురాముడు తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

అక్కడే ఉన్న పోలీసులు గమనించి రైతు పరశురాముడును హాస్పిటల్ కు తరలించారు. ఆయనకు సంబంధించిన ఐదు ఎకరాల భూమిని ఇదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేయడంతో, పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించానని, తమకు న్యాయం జరగలేదంటూ రైతు పరశురాముడు వీరి కుటుంబ సభ్యులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పురుగుల మందు తాగిన రైతు పరశురాముడిని పోలీస్ బైక్ పై హాస్పిటల్ కు తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement