Thursday, April 25, 2024

విద్యాసంస్థలు తెరిచే వరకు పోరాటం ఆగదు..

మహబూబ్‌నగర్‌ టౌన్‌ : రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలను వెంటనే వెనక్కి తీసుకొని విద్యాసంస్థలు ప్రారంభించాలని జిల్లాలోని అన్ని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా జిల్లాలోని డిఐఈఓ కార్యాలయం ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. ప్రభుత్వం కరోనా నిబంధనల ఆంక్షలు విధిస్తూ వెంటనే విద్యాసంస్థలను ప్రారంభించాలని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తొమ్మిదవ తరగతి నుండి ఆపై తరగతులు విద్యార్థులకు కరోనా నిబంధనల ప్రకారం పాఠాలు బోధించాలని పేర్కొన్నారు. అనంతరం ఇంటర్మీడియట్‌ అధికార వెంకటేశ్వర్లు కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌్‌ఎఫ్‌ , ఎన్‌ఎస్‌యుఐ , పిడిఎస్‌యు , బిసి , జివిఎస్‌ , జెఎసి విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement