Saturday, April 20, 2024

ఫ్యాన్‌లు లేక ఇబ్బంది పడుతున్న డయాలసిస్‌ పేషెంట్స్..

గద్వాల : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్‌ సెంటర్‌ ను విజిట్‌ చేసి డయాలసిస్‌ పేషెంట్స్‌ సమస్యలను తెలుసుకున్నారు టిఆర్‌ఎస్‌వి జిల్లా కోఆర్డినేటర్‌ కురువ పల్లయ్య. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… డయాలసిస్‌ సెంటర్‌ దగ్గర బయట హాల్‌లో డయాలసిస్‌ పేషెంట్స్‌ కూర్చునే దగ్గర ఫ్యాన్స్‌ లేకపోవడం వలన వేడిమికి పేషెంట్స్‌ చాలా ఇబ్బంది పడుతున్నారు. కేవలం ఒక ఫ్యాన్‌ మాత్రమే ఉంది. పేషెంట్స్‌ మాకు ఫ్యాన్‌ లేక చాలా ఇబ్బందిగా ఉంది. మాకు రెండు ఫ్యాన్స్‌ లేక కూలర్స్‌ ఏర్పాటు చేయించండి అని విన్నవించారు. వెంటనే సూపరింటెండెంట్‌ శోభరాణితో , డయాలసిస్‌ సెంటర్‌ ఇంచార్జి డా.కిషోర్‌ కుమార్‌లతో మాట్లాడి తక్షణమే డయాలసిస్‌ పే షెంట్స్‌ కు ఫ్యాన్స్‌ ను ఏర్పాటు చేయాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement