Sunday, August 1, 2021

సిఎస్‌ఆర్‌ కార్యక్రమం..

మహబూబ్‌నగర్‌ : అడ్డాకుల మండల పరిధిలోని శాఖాపూర్‌ శివారులో గల వెస్ట్రన్‌ ఆంధ్ర టోల్‌గేట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో సిఎస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాలుగు గ్రామపంచాయితీలకు అడ్డాకుల మండల పరిధిలోని మూడు అడ్డకుల , శాఖాపూర్‌ , కందూరు గ్రామ పంచాయితీలు ఉండగా , మూసాపేట మండలంలోని కొమిరెడ్డిపల్లి గ్రామపంచాయితీలకు సిఎస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దోమల నివారణకు వాటిని అరికట్టడానికి స్ప్రే చేయుటకు ఫాగింగ్‌ మిషన్‌ వాటితో పాటు శాఖాపూర్‌ , కొమిరెడ్డి పల్లి గ్రామ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు ఫర్నిచర్‌ వెస్ట్రన్‌ ఆంధ్ర టోల్‌వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ మదన్‌ మోహన్‌ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అడ్డాకుల శాఖాపూర్‌ గ్రామ సర్పంచ్‌ జయన్న గౌడ్‌ , అడ్డాకుల గ్రామ సర్పంచ్‌ మంజుల భీమన్న యాదవ్‌ , శాఖాపూర్‌ గ్రామ సెక్రటరీ మహేష్‌ , కొమిరెడ్డిపల్లి సర్పంచ్‌ సాయిరెడ్డి, కందూరు సర్పంచ్‌ శ్రీకాంత్‌ , వెస్ట్రన్‌ ఆంధ్ర టోల్‌ వేస్‌ అన్ని విభాగాల మేనేజర్స్‌ వివిధ భాగాల ఉద్యోగస్తులు , శెంతిల్‌ కుమార్‌ , దిలీప్‌ , బాలమురుగన్‌ , శరన్‌ రాజ్‌ , రాకేష్‌ కుమార్‌ , కిరీటి , కిషోర్‌ , తేజ స్వరూప్‌ , కోటి లింగం , సురేందర్‌ రెడ్డి ,అరుల్‌ , జితేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News