Wednesday, May 19, 2021

ఎమ్మెల్యే సొంత వార్డులో కాంగ్రెస్ గెలుపు

అచ్చంపేట, అర్బన్, : ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సొంత వార్డు 10 లో కాంగ్రెస్ అభ్యర్థి సునీత టిఆర్ఎస్ అభ్యర్థి భీమా రాణి పై గెలుపొందినది. ఎమ్మెల్యే నివాసముండే 10వ వార్డులో ఎమ్మెల్యే బాలరాజు తో పాటు ఆయన సతీమణి అమల, అవార్డులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వార్డులో సునాయాసంగా గెలుస్తామని ధీమా గా ఉన్న టిఆర్ఎస్ అభ్యర్థి భీమా రాణి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బాలరాజు లకు చెంపపెట్టు గా కాంగ్రెస్ అభ్యర్థిని అవార్డు ఓటర్లు గెలిపించారు. 120 కి పైగా ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సునీత గెలుపొందడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇదే వార్డులో 120 దొంగ ఓట్లు నమోదు చేయడంతో మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ కాంగ్రెస్ నేతలు పట్టుకుని ఓటర్ జాబితా నుండి ఓట్లను తొలగించే వరకు ఉద్యమించారు. తహసిల్దార్ ఓటర్ జాబితా నుండి 120 దొంగ ఓట్లను తొలగించారు.ఈ ఓట్లు తొలగించకపోతే టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపును కాంగ్రెస్ నాయకులు చొరవతో బెడిసికొట్టింది.

Advertisement

తాజా వార్తలు

Prabha News