Saturday, April 20, 2024

మహబూబ్‌నగర్ లో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ పట్టణంలో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్ చేసింది. బృందావన్‌ కాలనీలో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్ చేయడంతో ఆ ప్రాంత వాసులు బెంబేలెత్తిపోతున్నారు. చెడ్డీ గ్యాంగ్ ఓ ఇంట్లో చోరీకి విఫలయత్నం చేశారు. అలాగే నాలుగు రోజుల క్రితం ఇదే కాలనీలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీకి పాల్పడి.. 12 తులాల బంగారాన్ని దొంగిలించారు. వరుస చోరీలతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. అయితే పోలీసులు సీసీ కెమెరాల్లో చెడ్డీ గ్యాంగ్ దృశ్యాలు రికార్డ్ అయిన వాటి ఆధారంగా గ్యాంగ్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement