Tuesday, March 26, 2024

కొల్లాపూర్​ డిపో బస్సుల్లో ఘోరం.. ప్రయాణికులకు విరిగిన సీట్లే దిక్కు

పెద్దకొత్తపల్లి, (ప్రభ న్యూస్‌): కొల్లాపూర్‌ ఆర్టీసీ డిపోకు చెందిన డీలక్స్‌ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు విరిగిన సీట్లే దిక్కు అయ్యాయి. ప్రతిరోజు కొల్లాపూర్‌ నుండి హైదరాబాద్‌ వరకు ప్రయాణీకులను చేరవేస్తూన్న ఆర్‌టిసి బస్సు ఏపి29జెడ్‌1031లో సీట్లు- సరిగా లేకపోవడంతో అందులో ప్రయాణించే ప్రయాణికులకు నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతిరోజు కొల్లాపూర్‌ నుండి హైదరాబాద్‌కు దాదాపుగా రెండు వందల కిలోమీటర్ల దూరం ఉండగా ప్రయాణం నాలుగు గంటలకు పైగానే ఉంటుంది.

దీనివలన అసౌకర్యంగా ఉన్న విరిగిన సీట్లపై కూర్చుని అతికష్టంగా భద్రత కోసం కిటికీలకు ఉన్న భద్రత రాడ్లను పట్టుకుని ప్రయాణం చేసే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఆర్‌టిసి అధికారులు స్పందించి ప్రజలు సౌకర్యవంతంగా ప్రయాణం చేసేందుకు చర్యలు తీసుకొని బస్సులో అసౌకర్యంగా ఉన్న సీట్లను మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement