Monday, October 14, 2024

MBNR: అజ్జు మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు.. ఎమ్మెల్యే ఆల

అజ్జు మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. దేవరకద్ర నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్, నిరంతరం బీఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే దేవరకద్ర మండల కేంద్రానికి చెందిన అజ్జు నిన్న రాత్రి గుండెపోటుతో మరణించాడు.

అతని పార్థీవదేహానికి దేవరకద్ర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని, అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement