Saturday, January 28, 2023

ఫిబ్ర‌వ‌రి 16 నుంచి మ‌హా మేఢారం జాత‌ర‌..

హైదరాబాద్‌, (ప్రభన్యూస్) : ఆసియాలోనే అతి పెద్ద జాతరగా, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన వనదేవతల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. రెండేళ్లకోసారి వచ్చే ఈ మహా జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తారు. కోవిడ్‌ మొదలైన తర్వాత ఇది మొదటి మెడారం జాతర కావ‌డంతో భ‌క్తుల ఎక్కువ సంఖ్య‌లో వ‌చ్చే అవ‌కాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం జాతరకు సంబంధించిన పనులను చేస్తోంది. ఇప్పటికే ఈ జాతర పనుల కోసం ప్రభుత్వం రూ.75 కోట్ల నిధులను విడుదల చేసింది.

సమ్మక్క-సారలమ్మ మహా జాతర-2022 తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు ఈ మహా జాతర జరగనుంది. 16న సారలమ్మ కన్నెపల్లి నుంచి గద్దెపైకి రాక, 17న చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి రాక, 18న భక్తులకు అమ్మవార్ల దర్శనం, 19న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారు.

- Advertisement -
   

ఈ జాతరకు సంబంధించి ఉమ్మడి వరంగల్‌ జిల్లా వివిధ శాఖల అధికారలతో జాతర పనులను ప్రభుత్వం చేపడుతుంది. మరోవైపు పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. జాతరకు సమయం దగ్గర పడుతుండడంతో పనుల్లో వేగం పెంచాలని స్థానికులు కోరుతున్నారు. జాతర సమయంలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండ‌డంతో కొందరు భక్తులు ఇప్పటి నుంచే అమ్మవార్లను దర్శించుకుని మొక్కలు చెల్లిస్తున్నారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement