Wednesday, November 27, 2024

Live: మూసీ నది పునరుజ్జీవ సంకల్ప పాదయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

YouTube video
మూసీ పున‌రుజ్జీవ యాత్ర
సంగెం నుంచి ప్రారంభ‌మైన సీఎం రేవంత్ పాద‌యాత్ర‌
నది కుడి ఒడ్డున భీమలింగం వరకు కొన‌సాగునున్న యాత్ర‌
2.5 కిలోమీటర్ల న‌డ‌వ‌నున్న సీఎం
న‌ది ప‌రీవాహక ప్రాంత తీరుతెన్నుల ప‌రిశీల‌న‌
న్మదినోత్సవం రోజే సరికొత్త కార్యక్రమం

మూసీ నది పునరుజ్జీవన సంకల్ప యాత్రను సంగెం నుంచి చేప‌ట్టారు రేవంత్. ముందుగా మూసీ మాతకు పూలుజల్లి హారతి ఇచ్చారు. మూసీ నది కుడి ఒడ్డున భీమలింగం వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల పాదయాత్ర సాగ‌నుంది. అలాగే ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంట సంగెం – నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు చేప‌ట్టిన ఈ యాత్ర‌లో రేవంత్ మూసి పరివాహ‌క ప్రాంత తీరుతెన్నుల‌ను ప‌రిశీలించారు. ఆ ప్రాంతంలో నివ‌సిస్తున్న వారితో ఆయ‌న మాట్లాడారు.. ఇదే సంద‌ర్భంగా ఆ ప్రాంత రైతుల‌తో మాట్లాడుతూ ముందుకు క‌దులుతున్నారు. ఈ యాత్ర త‌ర్వాత మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి ముఖ్యమంత్రి ప్రసంగించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement