Monday, October 14, 2024

Lie – చెరువులో బాలుడి మృతి.. విచార‌ణ‌లో కొత్త ట్విస్ట్ …

హైదరాబాద్ నగరంలో ఇంటి బయట ఆడకుంటూ అదృశ్యమైన బాలుగు క్వారీలో శవమై కనిపించాడు. వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందినట్లు మొదట భావించినప్పటికీ పోలీసుల దర్యాప్తులో అది నిజం కాద‌ని తేలింది…వివ‌రాల‌లోకి వెళితే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కైసే ధుర్యోదన్, కైసే అనీషా దంపతులు గత కొంతకాలంగా మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని లెనిన్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. వారు మహారాష్ట్ర నుంచి మూడేళ్ల కిందటే నగరానికి వలస వచ్చారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. పెద్ద కుమారుడు మనోజ్ (11) మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ముగ్గురు స్నేహితులతో కలిసి ఎల్లంబండ వద్ద క్రికెడ్‌ ఆడేందుకు వెళ్లాడు. అనంతరం నలుగురు కలిసి పక్కనే ఉన్న చెరువులో ఈతకు వెళ్లారు. ఐతే నలుగురికీ ఈత రాకపోవడంతో ముగ్గురు చెట్ల కొమ్మలు, బండరాళ్లను పట్టుకుని ఒడ్డుకు చేరారు. మనోజ్‌ మాత్రం నీట మునిగి మృతి చెందాడు.


ఇంట్లో తెలిస్తే తమను తిడతారేమోననే భయంతో ముగ్గురు స్నేహితులు అబద్ధాం చెప్పారు. కుక్కలు వెంటబడ్డాయని, భయంతో పారిపోయే క్రమంలో మనోజ్‌ చెరువులో పడ్డాడనే కట్టుకథ అల్లారు. ముగ్గురి ఇళ్లలో ఇదే చెప్పాలని ముందే నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే అలాగే చెప్పారు. ఐతే పోలీసుల దర్యాప్తులో అసలు అహద్‌ అసలు విషయం బయటపెట్టాడు. అప్పటికే చీకటి పడటంతో మరుసటి రోజు చెరువులో గాలించగా మనోజ్‌ మృతదేహం లభ్యమైంది. దీంతో మిస్టరీ వీడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement